కాళేశ్వరం ముమ్మాటికీ వైఫల్యమే | Opposition Partys Round Table Conference On Kaleswaram Project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం ముమ్మాటికీ వైఫల్యమే

Published Fri, Oct 4 2019 4:58 AM | Last Updated on Fri, Oct 4 2019 7:44 AM

Opposition Partys Round Table Conference On Kaleswaram Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ముమ్మాటికీ ఓ వైఫల్యమే అని.. దీని ద్వారా జరిగే లబ్ధికన్నా నష్టమే ఎక్కువని ‘కడెం ప్రాజెక్టు– కాళేశ్వరం సోకులు– నిజానిజాలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశం అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీ ద్వారా ఎత్తిన నీటికంటే, మేడిగడ్డ నుంచి సముద్రానికి వెళ్లిందే ఎక్కువని తేలి్చచెప్పింది. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉంటే నిర్మాణ వ్యయం వృథా అయ్యేది కాదని, ఇప్పుడు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచి్చంచి పైసా ప్రయోజనం ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేసింది. ఇప్పటికైనా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని తీర్మానించింది.

గురువారం తెలంగాణ జల సాధన నమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్‌ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి, బీజేపీ నేత విజయరామారావు, కాగజ్‌నగర్‌ నేత పాల్వాయి హరీశ్, టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ చంద్రకుమార్, న్యూడెమొక్రసీ నేత గోవర్ధన్, కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎల్లంపల్లికి వచి్చన నీళ్లు, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఏవీకూడా కాళేశ్వరంలోని మేడిగడ్డ ద్వారా ఎత్తిపోసినవి కావన్నారు. సుమారు 1,500 టీఎంసీలు మేడిగడ్డను దాటుకుంటూ సముద్రంలోకి వెళ్లాయ ని తెలిపారు. ప్రతిఏటా విద్యుత్, వడ్డీలు, నిర్వహణకు అయ్యే వ్యయం రూ.65 వేల కోట్లు ఉంటుందన్నారు. ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే రూ.లక్ష కోట్లు దాటిందని, ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి రూ.3 లక్షల కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. 

జాతీయ హోదాపై మభ్య పెట్టారు..
మేడిగడ్డ వద్ద లభ్యతగా ఉండే జలాల్లో 80 శాతం ప్రాణహిత నది నుంచి వచ్చేవేనని, అక్కడ తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారా నీళ్లు పారించే అవకాశం ఉండేదని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.   కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని సీఎం కేసీఆర్‌ కేవలం నోటిమాట ద్వారానే కోరారు తప్పితే దానికి సంబంధించిన ఎలాంటి నివేదికలు కేంద్రానికి సమరి్పంచలేదని కేంద్ర జలశక్తి మంత్రి స్వయంగా రాజ్యసభలో వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ, కాళేశ్వరం పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement