
పంజగుట్ట: ప్రగతి భవన్ వద్ద ఓ యువకుడు మెరుపు నిరసన చేశాడు. బుధవారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ప్రగతిభవన్ ఎగ్జిట్ గేటు వద్ద ప్ల కార్డు పట్టుకుని నిరసన తెలిపి మెరుపు వేగంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు పట్టుకునేందుకు వచ్చే లోపే వెళ్లిపోయాడు. ప్ల కార్డుపై ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం నా హక్కు’ అని ఇంగ్లిష్‌లో రాసుకున్నాడు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజేలను పరిశీలించి నిరసనకారుడు ఎవరనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నిరసన తెలుపుతున్న యువకుడు
Comments
Please login to add a commentAdd a comment