ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలకమైన వయోపరిమితిని ఐదేళ్లు సడలిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం నిరుద్యోగ వర్గాల్లో నూతనోత్సాహం నింపింది. వయోపరిమితి తీరడంతో పలువురు నిరుద్యోగులకు సర్కారు కొలువు కలగా మారిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిపట్ల వరమైంది. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,500 ఖాళీలు ఉన్నట్లు అంచనా.
ఇందులో ఉపాధ్యాయ కేటగిరీకి సంబంధించి 1500 ఖాళీలున్నాయి. ఇందులో డీఎస్సీ ద్వారా 1100 ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా జిల్లా విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అదేవిధంగా రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయకులు తదితర పోస్టులు కలుపుకొని 500 ఖాళీలున్నాయి. అదేవిధంగా ైవె ద్య, ఆరోగ్య, ఐసీడీఎస్, సంక్షేమ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయి.
ఇక పోటాపోటీ..
వయోపరిమితిని పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే క్రమంలో సీనియర్లకు అవకాశం కలుగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే వయసు పెరిగిన వారికి గోల్డెన్‌చాన్స్ కాగా, జూనియర్లకు మాత్రం ఇబ్బందికరమే. ఏకంగా 5 సంవత్సరాల వయో పరిమితిని పెంచిన తరుణంలో ఉద్యోగాల నియామకాల్లో పోటీ విపరీతంగా పెరగనుంది. ప్రస్తుతం జిల్లాలో 3లక్షల మంది గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తిచేసి ఉన్నట్లు అంచనా. అదేవిధంగా ఆపై కోర్సులు పూర్తిచేసి ఉన్నవాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో కొందరు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తుండగా.. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి శిక్షణ తీసుకునే పనిలో ఉన్నారు.
కోచింగ్ సెంటర్ల జోరు..
కొత్త రాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకే అంటూ ప్రచారం చేసిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరుణంలో.. తాజాగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుని ఉద్యోగాలు సాధించాలనే పట్టుదల యువతలో మరింత పెరిగింది. దీనికితోడుగా వయోపరిమితి పెండచంతో సీనియర్లు సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో పోటీతత్వం పెరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లను వెతికే పనిలో పడ్డారు. ఇప్పటికే దీర్ఘకాలికంగా శిక్షణ తీసుకుంటుండగా.. మిగతా వారు సైతం శిక్షణబాట పట్టడంతో కోచింగ్ సెంటర్లకు మంచి గిరాకీ దొరికినట్లయింది.
నిరుద్యోగుల్లో నూతనోత్సాహం
Published Wed, Nov 26 2014 12:02 AM | Last Updated on Mon, Apr 8 2019 7:51 PM
Advertisement
Advertisement