Graduation Course
-
విదేశీ విద్యకే మొగ్గు
సాక్షి, అమరావతి: విదేశీ విద్యపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. అంతర్జాతీయ యూనివర్సిటీలు/విద్యా సంస్థలు ప్రదానం చేసే డిగ్రీలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో విదేశాల బాటపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022 నాటికి 79 దేశాల్లో 13 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు వివిధ వర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే గతేడాది ఏకంగా 7.5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు పయనమయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3.37 లక్షల మంది తరలివెళ్లారు. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు కెనడా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాకే మొదటి ప్రాధాన్యత.. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) కోర్సుల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ కోర్సులకు మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు వాటినే ఎంచుకుంటున్నారు. మంచి పే ప్యాకేజీల కోసం బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరేవారూ ఉంటున్నారు. ఈ క్రమంలో భారతీయులు తమ మొదటి ప్రాధాన్యతను అమెరికాకే ఇస్తున్నారు. ఇక్కడ స్టెమ్ కోర్సుల్లోనే ఎక్కువ మంది చేరుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 4.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. రెండో స్థానంలో కెనడా.. భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత కెనడా రెండో స్థానంలో నిలుస్తోంది. యూఎస్‌తో పోలిస్తే వర్సిటీల్లో సీటు సాధించడం, ఇమ్మిగ్రేషన్ విధానాలు అనుకూలంగా ఉండటంతో కెనడాకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆ దేశ ఇమ్మిగ్రేషన్– సిటిజన్‌షిప్ డేటా ప్రకారం.. కెనడాకు వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల జాబితాలో 1.86 లక్షల మందితో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక యూకే తక్కువ కాల వ్యవధిలో వివిధ కోర్సులు అందిస్తుండటం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో విద్యాభ్యాసం తర్వాత శాశ్వత నివాసితులుగా మారేందుకు అవకాశాలు ఉండటం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సుల్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉండటంతో జర్మనీని ఎంచుకుంటున్నారు. వెనక్కి వచ్చేవారు తక్కువే.. ముఖ్యంగా 2015–19 మధ్య విదేశాల్లో చదివిన భారతీయ విద్యార్థుల్లో కేవలం 22 శాతం మంది మాత్రమే స్వదేశానికి తిరిగి వచ్చి మంచి ఉపాధిని పొందినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. -
నిరుద్యోగుల్లో నూతనోత్సాహం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలకమైన వయోపరిమితిని ఐదేళ్లు సడలిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం నిరుద్యోగ వర్గాల్లో నూతనోత్సాహం నింపింది. వయోపరిమితి తీరడంతో పలువురు నిరుద్యోగులకు సర్కారు కొలువు కలగా మారిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిపట్ల వరమైంది. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,500 ఖాళీలు ఉన్నట్లు అంచనా. ఇందులో ఉపాధ్యాయ కేటగిరీకి సంబంధించి 1500 ఖాళీలున్నాయి. ఇందులో డీఎస్సీ ద్వారా 1100 ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా జిల్లా విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అదేవిధంగా రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయకులు తదితర పోస్టులు కలుపుకొని 500 ఖాళీలున్నాయి. అదేవిధంగా ైవె ద్య, ఆరోగ్య, ఐసీడీఎస్, సంక్షేమ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయి. ఇక పోటాపోటీ.. వయోపరిమితిని పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే క్రమంలో సీనియర్లకు అవకాశం కలుగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే వయసు పెరిగిన వారికి గోల్డెన్‌చాన్స్ కాగా, జూనియర్లకు మాత్రం ఇబ్బందికరమే. ఏకంగా 5 సంవత్సరాల వయో పరిమితిని పెంచిన తరుణంలో ఉద్యోగాల నియామకాల్లో పోటీ విపరీతంగా పెరగనుంది. ప్రస్తుతం జిల్లాలో 3లక్షల మంది గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తిచేసి ఉన్నట్లు అంచనా. అదేవిధంగా ఆపై కోర్సులు పూర్తిచేసి ఉన్నవాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో కొందరు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తుండగా.. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి శిక్షణ తీసుకునే పనిలో ఉన్నారు. కోచింగ్ సెంటర్ల జోరు.. కొత్త రాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకే అంటూ ప్రచారం చేసిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరుణంలో.. తాజాగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుని ఉద్యోగాలు సాధించాలనే పట్టుదల యువతలో మరింత పెరిగింది. దీనికితోడుగా వయోపరిమితి పెండచంతో సీనియర్లు సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో పోటీతత్వం పెరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లను వెతికే పనిలో పడ్డారు. ఇప్పటికే దీర్ఘకాలికంగా శిక్షణ తీసుకుంటుండగా.. మిగతా వారు సైతం శిక్షణబాట పట్టడంతో కోచింగ్ సెంటర్లకు మంచి గిరాకీ దొరికినట్లయింది.