
రెండోరోజు పరామర్శ యాత్ర ప్రారంభం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర.. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో రోజుకు చేరుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తున్నారు.
అశేష జనసందోహం మధ్య మొదటి రోజు మూడు కుటుంబాలను పరామర్శించిన షర్మిల... రెండో రోజు మరో మూడు కుటుంబాలను పరామర్శించనున్నారు. కల్వకుర్తి నుంచి ఆమె ఉదయం బయల్దేరారు. మొదట అమ్రాబాద్‌లోని రంగయ్య కుటుంబాన్ని పరామర్శించి.. అదే ఊరిలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌లో వైఎస్‌ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి... ఎత్తం గ్రామంలో నర్సింగ్ కుటుంబాన్ని, కొల్లాపూర్‌లో రామచంద్రయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు.