
కార్మికులకు అండగా వైఎస్సార్‌సీపీ
రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల డిమాండ్లపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మంగ ళవారం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్ ఆరోపించారు...
- పార్టీ యూత్ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్‌రాజ్
కాజీపేట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల డిమాండ్లపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవ హరిస్తోందని మంగ ళవారం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్ ఆరోపించారు. కార్మికులు 16 రోజులుగా సమ్మె చేస్తుంటే పటి ట్టిం చుకోకపోవటం బాధాకరమన్నారు. వాడవాడలా చెత్త పేరుకుపోతోందని, ్రపజలు ఇబ్బం దులకు గురవుతున్నా ప్రభుత్వం మిన్నకుంద ని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం హైదరాబాద్‌లో పారిశుద్ధ కార్మికులకు వేతనాలు పెంచి మిగతా కార్మికులను పట్టించుకోవట్లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.