సాక్షి, తిరుమల : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈనెల 10వ తేదీ తిరుమలకు రానున్నారు. ఉపరాష్ట్రపతి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు తిరుమల చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. 11వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో నెల్లూరు వెళతారని అధికార వర్గాలు తెలిపాయి.