అమెరికాలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. అయినా, ఇప్పటికే పది మంది భారత సంతతి పౌరులు ఈ ఎన్నికల్లో పోటీపడేందుకు సిద్ధం అయిపోతున్నారు. వరుసగా మూడుసార్లు ఎన్నికైన ఏకైక భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా మరోసారి కాలిఫోర్నియా నుంచి బరిలోకి దిగుతున్నారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవికి మళ్లీ పోటీ చేస్తానని కమలా హారిస్ చెబుతున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ పదవికి రిపబ్లికన్ నీల్ కష్కరీ రంగంలోకి దిగుతున్నారు. ఒకవేళ ఎన్నికైతే.. బాబీ జిందాల్, నిక్కీ హేలీల తర్వాత ఏకైక భారతీయ గవర్నర్ ఈయనే అవుతారు.
అయితే.. ఈసారి అందరి కళ్లూ మాత్రం ఒబామా యంత్రాంగంలో వాణిజ్యశాఖ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ రో ఖన్నా మీదే ఉన్నాయి. తన పార్టీకే చెందిన మైక్ హోండాకు ఆయన గట్టి సవాలు విసిరి.. 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్కు పోటీ పడుతున్నారు. ఒబామా ఎన్నికకు ఖన్నా భారీ మొత్తంలో విరాళాలు సేకరించడమే కాక, ప్రచారంలో కూడా గట్టిగా పాల్గొన్నారు. ఇదే స్థానంలో మరో భారతీయ అమెరికన్ కూడా పోటీలో ఉన్నారు. వనీలా మాథుర్ సింగ్ అనే మెడికల్ ప్రొఫెసర్ కూడా రంగంలో ఉన్నా, గెలిచే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ ఒకే స్థానానికి ఇద్దరు ఎన్నారైలు పోటీపడటం మాత్రం ఇదే తొలిసారి అవుతుంది. న్యూజెర్సీ అసెంబ్లీలో ఎన్నారై ప్రతినిధిగా ఉన్న చివుకుల ఉపేంద్ర ఈసారి న్యూజెర్సీ 12వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు పోటీ పడనున్నట్లు చెప్పారు. ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న మానన్ త్రివేదీ, ఇంకా పాల్ ర్యాన్, అమర్దీప్ కలేకా, స్వాతి దండేకర్, మంజు గోయల్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
అమెరికా ఎన్నికల్లో పది మంది ఎన్నారైలు!!
Published Mon, Feb 24 2014 11:57 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
Advertisement