సాక్షి, విజయవాడ బ్యూరో: టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని 65 మందితో ఏర్పాటు చేయాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మూడు, నాలుగు రోజుల్లో కమిటీని ప్రకటించనున్నారు. మంగళవారమిక్కడ తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో కార్యకర్తలు బలంగా ఉన్నారని, నాయకులు ముందుండి వారిని నడిపించాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎంపిక చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. సమావేశం ప్రారంభానికి ముందు నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అంతా కలసి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్దామని చెప్పిన రేవంత్.. అందరినీ అక్కడికి పంపించి తాను మాత్రం చంద్రబాబు నివాసానికి వెళ్లినట్లు తెలిసింది.
తర్వాత నేరుగా చంద్రబాబుతో కలసి క్యాంపు కార్యాలయానికి రావడంతో ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గొడవ ముదురుతుండటంతో అక్కడున్న వారు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఎంపీ రమేష్ రాథోడ్, నేత లు మోత్కుపల్లి, నామా నాగేశ్వరరావు, వివేక్, ఉమామాధవరెడ్డి, సీతక్క, మండవ వెం కటేశ్వరరావు, సాయన్నసమావేశంలో పాల్గొన్నారు.
65 మందితో టీటీడీపీ రాష్ట్ర కమిటీ
Published Wed, Sep 16 2015 4:01 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM
Advertisement