'ఆప్' నేత చెంప చెళ్లుమనిపించిన మహిళ | AAP spokesman slapped on live television by former party member | Sakshi
Sakshi News home page

'ఆప్' నేత చెంప చెళ్లుమనిపించిన మహిళ

Published Sat, Feb 22 2014 11:23 AM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

'ఆప్' నేత చెంప చెళ్లుమనిపించిన మహిళ - Sakshi

'ఆప్' నేత చెంప చెళ్లుమనిపించిన మహిళ

ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి ఇజాజ్ ఖాన్కు ఓ టీవీ షోలో చేదు అనుభవం ఎదురైంది. ఆపార్టీ మాజీ మహిళ నేత ఆయనపై చేయి చేసుకున్నారు.  'భారత్లో కుల రాజకీయాలు' అనే అంశంపై ఓ టీవీ ఛానల్ లైవ్ చర్చ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ చర్చ కార్యక్రమంలో ఇజాజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు టీనా శర్మకు ఆగ్రహం కలగించింది. దాంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది.

ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాత వెంటనే జోక్యం చేసుకుని టీనా శర్మకు క్షమాపణలు చెప్పాలని ఇజాజ్ ఖాన్ను కోరింది. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో టీనా శర్మ కోపం కట్టలు తెంచుకుంది. ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుందన్న సంగతి టీనా మరిచిపోయారు. ఒక్కసారిగా ఇజాజ్ఖాన్ ముందుకు వచ్చి చెంప చెళ్లుమనిపించారు.

దాంతో చర్చ కార్యక్రమానికి వచ్చిన సభ్యులతోపాటు ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు, నిర్వహకులు నిర్ఘాంతపోయారు. కాగా టీనా శర్మ గతంలో భారతీయ జనతా పార్టీలో పని చేశారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చాక అందులో చేరింది. అనంతరం రెబల్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీపై అసంతృప్తి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వీడియోను మీరు వీక్షించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement