ఈ కొత్త సెన్సేషన్ ఎవరో తెలుసా?
పాకిస్థాన్ నీలికళ్ల ‘చాయ్‌వాలా’ తరహాలోనే ఇప్పుడొక కొత్త సెన్సేషన్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
పాకిస్థాన్ నీలికళ్ల ‘చాయ్‌వాలా’ తరహాలోనే ఇప్పుడొక కొత్త సెన్సేషన్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ ‘చాయ్‌వాలా’ను తోసేసి.. తొక్కేసి.. ఇప్పుడు నేపాలీ తర్కారివాలీ (కూరగాయలు అమ్మే మగువ) నెటిజన్ల హృదయాలను ఉర్రూతలూగిస్తోంది.
గతకొన్ని వారాలుగా నీలికళ్ల పాకిస్థాన్ ‘చాయ్‌వాలా’ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇస్లామాబాద్‌లో ఓ మారుమూల చాయ్ అమ్ముకునే ఆర్షద్ ఖాన్ ఫొటో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో అతను ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారాడు. పాక్ ‘అణుబాంబు’ ఇతడేనంటూ అతని ఫొటోలు ఆన్‌లైన్‌లో బాగా హల్‌చల్ చేశాయి. అదేవిధంగా ఇప్పుడు కూరగాయాలు అమ్మే నేపాలీ అమ్మాయి ఫొటోలు సోషల్ మీడియా హార్ట్‌బీట్‌గా మారిపోయాయి. ముగ్ధమోహనరూపంతో ఉన్న ఆమె ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. తర్కారివాలీ (#Tarkariwali) హ్యాష్‌ట్యాగ్‌తో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
మీడియా కథనాల ప్రకారం రూపచంద్ర మహాజన్ అనే నెటిజన్ ఈ ‘తర్కారివాలీ’ ఫొటోలను తీశాడు. గోర్ఖా, చిత్వాన్ బ్రిడ్జి వద్ద చేపల పట్టే ప్రదేశంలో ఈమె కూరగాయలు అమ్ముతూ కనిపించింది. అందం, ఆత్మవిశ్వాసంతోపాటు కష్టించి పనిచేస్తున్న ఆమె నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. అందుకే ఆమెను కొనియాడుతూ.. ఆమె ముగ్ధమోహన సౌందర్యానికి నీరాజనాలు పడుతూ నెటిజన్లు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు..