
విమానం రద్దు... ప్రయాణికులకు ఇబ్బందులు
గన్నవరం విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా విమానంలో ఆదివారం సాంకేతిక లోపం ఏర్పడింది.
విజయవాడ : గన్నవరం విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా విమానంలో ఆదివారం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానం సర్వీస్ను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు. అయితే ప్రత్యామ్నయ విమానం సర్వీసును ఏర్పాటు చేయకుండా సదరు విమానాన్ని రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఉన్నతాధికారులపై మండిపడుతున్నారు. అధికారులు ఎంటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో తిరిగి వెళ్లడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గన్నవరం విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఎయిర్ ఇండియా విమానం బయలుదేర వలసి ఉంది. ఆ క్రమంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. కానీ లోపాన్ని సరి చేయలేకపోయారు. దీంతో సదరు విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు ప్రకటించారు.