భారత వైమానిక దళ ప్రధానాధికారిగా అరుప్ రాహ | Air Marshal Arup Raha will be the next airforce chief | Sakshi
Sakshi News home page

భారత వైమానిక దళ ప్రధానాధికారిగా అరుప్ రాహ

Published Tue, Oct 29 2013 2:03 PM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

Air Marshal Arup Raha will be the next airforce chief

భారత వైమానిక దళ (ఐఏఎఫ్) ప్రధానాధికారిగా ఎయిర్ మార్షల్ అరుప్ రాహ పేరును కేంద్రంప్రభుత్వం మంగళవారం ఖరారు చేసింది. ప్రస్తుత వైమానిక దళ ప్రధానాధికారి ఎన్ఏకే బ్రౌనీ డిసెంబర్ 31న పదవి విరమణ చేయనున్నారు. దాంతో ఐఏఎఫ్ ప్రధానాధికారిగా అరుప్ డిసెంబర్ 31న బాధ్యతలు స్వీకరిస్తారు.

 

అరుప్ ప్రస్తుతం ఐఏఎఫ్ ఉప ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1974, డిసెంబర్ 14న అరుప్ రాహ వైమానిక దళంలో ప్రవేశించారు. దాదాపు 39 ఏళ్లపాటు ఐఏఎఫ్లో పలు కీలక పదవుల్లో అరుప్ రాహ పని చేశారు. అలాగే ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంలో ఎయిర్ అటాచ్చీగా కూడా విధులు నిర్వర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement