రిటైల్ రుణాలపై ఆంధ్రాబ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు
రిటైల్ రుణాలపై ఆంధ్రాబ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు
Published Fri, Oct 11 2013 12:27 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు పోటీలో ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ కూడా వచ్చి చేరింది. గృహ రుణాలను బేసు రేటుకే అందిస్తుండగా, వాహన రుణాలపై మరో అర శాతం చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు 10.25%గా ఉంది. ఈ తగ్గింపు రేట్లు అక్టోబర్ 10 నుంచి జనవరి 31, 2014 వరకు అమలులో ఉంటాయని ఆంధ్రాబ్యాంక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్ సమయంలో అన్ని రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. గృహరుణాలను 10.25-10.5 శాతానికి, కార్ల రుణాలను 10.75%, ద్విచక్ర వాహనాలను 11.25%, కన్జూమర్ లోన్స్ 12.25%, ప్రభుత్వ, మంచి గుర్తింపు పొందిన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే క్లీన్ రుణాలను 14.25 శాతానికే అం దిస్తున్నట్లుబ్యాంక్ పేర్కొంది.
సిండికేట్ బ్యాంక్ కూడా...
బెంగళూరు: సిండికేట్ బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. రూ.75 లక్షలకు పైబడిన గృహ రుణాలపై వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇకపై రుణ మొత్తాలతో సంబంధం లేకుండా అన్ని గృహ రుణాలకు 10.25 బేస్ రేట్ ప్రాతిపదికగా ఉంటుంది. తక్షణం అమల్లోకి వచ్చేలా అన్ని ప్రస్తుత గృహ రుణాలకూ 10.25% రేటు వర్తిస్తుందని తెలిపింది. పండుగల నేపథ్యంలో నాలుగు చక్రాల వాహనాల రుణాలపై రేట్‌ను 11% నుంచి 10.90%కి ఇప్పటికే తగ్గించినట్లు పేర్కొంది. ద్విచక్ర వాహనాలపై రేటును అరశాతం తగ్గించినట్లు(12.25%కి) పేర్కొంది. పండుగల సీజన్‌లో అన్ని గృహ, వాహన రుణాలపై సర్వీస్ చార్జీలను 50% తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
Advertisement
Advertisement