రాజమండ్రిలో ఏపీ ‘రాజధాని’ ఆవిష్కరణ
ముందుగా నిర్ణయించిన ప్రకారం జరగాల్సింది హైదరాబాద్‌లో..
వరుస ఘటనలతో మసకబారిన ఏపీ ప్రభుత్వ పనితీరు
హైదరాబాద్: గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతికి దారితీసిన సంఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఏపీ సీఎం చంద్రబాబు.. రాజధాని కథను రాజమండ్రి కేంద్రంగా నడిపించా రా? అంటే అందరినోటా అవుననే వినిపిస్తోంది. సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన సీడ్ కేపిటల్ ప్రణాళిక విడుదల కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయించడంలోని ఆంతర్యమిదేనని అంటున్నారు. మే 25న మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం అందించింది. కచ్చితంగా జూలై 15 నాటికి సీడ్ కేపిటల్ ప్లాన్ అందిస్తామని అప్పట్లో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మీడియా ఎదుట ప్రకటించారు. దీని ప్రకారం ఈ నెల 14న రాజమండ్రిలో సీఎం చంద్రబాబు పుష్కరాలు ప్రారంభించి 15వ తేదీకి హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చేతుల మీదుగా సీడ్ కేపిటల్ ప్లాన్ అందుకుని ఆ తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహిం చాల్సి ఉంది. అయితే 14న పుష్కరాల ప్రారంభం రోజున చంద్రబాబు ప్రచార యావకు 29 మంది బలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జాతీయ, అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కింది. తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి.
జాతీయ మీడియా సైతం బాబు తీరును తప్పుపట్టింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టులో పౌరహక్కు ల సంఘాలు వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో మొత్తం వ్యూహాన్ని మార్చారు. ఆ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు పుష్కరాలు పూర్తయ్యే వరకు రాజమండ్రిలోనే ఉంటానని వ్యూహాత్మకంగా ప్రకటించారు. కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై భౌతిక దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారం, మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మె, పుష్కరఘాట్‌లో తొక్కిసలాట వంటి ఘటనలతో చంద్రబాబు ప్రభుత్వ పనితీరు పూర్తిగా మసకబారింది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో.. సిం గపూర్ సంస్థలు తుది ప్రణాళికను సమర్పించకముం దే రాజధాని ఇలా ఉండబోతోందంటూ నాలుగు ఊహా చిత్రాలను విడుదల చేసి ప్రజల దృష్టిని మళ్లించే యత్నం చేశారు. తాజాగా సోమవారం సింగపూర్ నుంచి వచ్చిన ప్రతినిధి బృందాన్ని నేరుగా రాజమండ్రి రప్పించి అక్కడే సీడ్ కేపిటల్ ప్లాన్ అందజేసే ఏర్పాట్లు చేశారని విమర్శలొస్తున్నాయి.
ప్రజల దృష్టి మరల్చడానికే!
Published Tue, Jul 21 2015 12:59 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement