రూ.4 వేల కంటే తక్కువకు ఐఫోన్
రూ.4 వేల కంటే తక్కువకు ఐఫోన్
Published Tue, Feb 7 2017 7:46 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
మరోసారి ఆపిల్ పాత ఐఫోన్ 6పై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్త ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.24వేల డిస్కౌంట్ ప్రకటిస్తూ రూ.3990కే ఆపిల్ ఐఫోన్ 6(స్పేస్ గ్రే, 16జీబీ వెర్షన్)ను విక్రయించనున్నామని ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్పై రూ.27,990కు అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ కింద రూ.24వేల డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తోంది. అదనంగా ఈఎంఐను అందుబాటులో ఉంచిన ఫ్లిప్కార్ట్, బ్యాంకు కార్డులపై ఇతర డిస్కౌంట్లను 5 శాతం ఆఫర్ చేస్తోంది.
అయితే ఐఫోన్6 స్పేస్ గ్రే, 16జీబీ వెర్షన్ను రూ.3990కే కొనుగోలు చేయదలుచుకున్న వారు తమ కొత్త ఐఫోన్ 6ఎస్ ప్లస్తో ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 16జీబీ ఐఫోన్ 6ను ఐఫోన్ 6ఎస్ ప్లస్తో ఎక్స్చేంజ్ చేసుకునేవారికి కచ్చితంగా ఈ డిస్కౌంట్ను అందించనున్నట్టు ఫ్లిప్కార్ట్ భరోసా ఇస్తోంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా ఐఫోన్ 6 ఫోన్పై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.
Advertisement
Advertisement