Apple iPhone 6
-
రూ.4 వేల కంటే తక్కువకు ఐఫోన్
మరోసారి ఆపిల్ పాత ఐఫోన్ 6పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్త ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.24వేల డిస్కౌంట్ ప్రకటిస్తూ రూ.3990కే ఆపిల్ ఐఫోన్ 6(స్పేస్ గ్రే, 16జీబీ వెర్షన్)ను విక్రయించనున్నామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌పై రూ.27,990కు అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ కింద రూ.24వేల డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. అదనంగా ఈఎంఐను అందుబాటులో ఉంచిన ఫ్లిప్‌కార్ట్, బ్యాంకు కార్డులపై ఇతర డిస్కౌంట్లను 5 శాతం ఆఫర్ చేస్తోంది. అయితే ఐఫోన్6 స్పేస్ గ్రే, 16జీబీ వెర్షన్‌ను రూ.3990కే కొనుగోలు చేయదలుచుకున్న వారు తమ కొత్త ఐఫోన్ 6ఎస్ ప్లస్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 16జీబీ ఐఫోన్ 6ను ఐఫోన్ 6ఎస్ ప్లస్‌తో ఎక్స్చేంజ్ చేసుకునేవారికి కచ్చితంగా ఈ డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ భరోసా ఇస్తోంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా ఐఫోన్ 6 ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. -
దీపావళికి ఐఫోన్ 6 రానట్లే!
కోల్‌కతా : ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్6 వినియోగదారులకు ఇది నిరాశ కలిగించే వార్తే. భారత్‌లో ఈ ఫోన్ విడుదల మరింత ఆలస్యం కానుంది. అమెరికా, చైనా మార్కెట్ల నుంచి ఐఫోన్ 6, 6 ప్లస్‌లకు విపరీతమైన డిమాండ్ రావడంతో ఇండియాలో ఫోన్ విడుదలను నెల పాటు వాయిదా వేయాలని అమెరికాలోని యాపిల్ సంస్థ భావిస్తోంది. దాంతో ముందుగా అనుకున్నట్లు దీపావళికి ఐఫోన్ 6 విడుదల కానట్లే. ఈ నేపథ్యంలో నవంబర్‌లో ఈ ఫోన్ మన మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఆంగ్ల దినపత్రిక ఎకనమిక్స్ టైమ్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. అయితే భారత్ లో దీపావళి ముఖ్యమైన పండుగ. ఈ సమయంలో ఐఫోన్ 6ను విడుదల చేస్తే అమ్మకాలు బాగుండాయని... యాపిల్ ఇండియా మేనేజ్మెంట్ పేరెంట్ కంపెనీకి విజ్ఞప్తి చేస్తోంది. వాస్తవానికి యాపిల్ సంస్థ అక్టోబరు 19న ఐఫోన్‌ను మన దేశంలో విడుదల చేద్దామనికుంది. అయితే ఫోన్ విడుదల అయిన తొలి మూడు రోజుల్లోనే కోటి ఐఫోన్లు అమ్ముడు కావటంతో యాపిల్ మేనేజ్మెంట్కు డిమాండ్‌ను అందుకోవడం కష్టంగా ఉంది. ఈ కారణంగా ఇండియా సహా మరికొన్ని దేశాల్లో ఐఫోన్ 6 విడుదలను వాయిదా వేయాలని యాపిల్ భావిస్తోంది. -
యాపిల్ ఐఫోన్ 6 హల్చల్
యాపిల్ ఐఫోన్ 6 హల్చల్ చేస్తోంది. శుక్రవారం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన యాపిల్ ఐఫోన్ 6 స్మార్ట్ఫోన్లను ముందుగా కొనుగోలు చేసిన జర్మనీకి చెందిన కస్టమర్లు ఆనందంతో మునిగి తేలారు. అత్యాధునిక ఫీచర్లను పొందుపర్చి 4.7 అంగుళాలు, 5.5 అంగుళాల స్క్రీన్‌తో ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మోడల్స్‌ను యాపిల్ గతవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం నుంచి అమెరికా, జర్మనీ తదితర దేశాల్లోని వీటి అమ్మకాలు ప్రారంభించింది. అక్టోబర్ 17న ఇవి భారత్ మార్కెట్లోకి అధికారికంగా రానున్నాయి. ఆన్‌లైన్‌లోనూ, బ్లాక్ మార్కెట్లోనూ ఈ ఫోన్ల ధర అక్షరాలా రూ.1లక్ష దాకా పలుకుతోంది. ఇక భారత్‌లో వీటి రాక కాస్త ఆలస్యం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్లను దక్కించుకునేందుకు యాపిల్ అభిమానులు భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ఐఫోన్లను అందరికన్నా ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ అభిమానులు భారీ రేటు కూడా ఇచ్చేందుకు సిద్ధపడుతుంటే.. మరోవైపు ముందుగా చెప్పిన సమయానికి ఈ హ్యాండ్సెట్స్ అందుబాటులోకి రాకపోవచ్చన్న ఊహాగానాలూ వస్తున్నాయి. -
ఊరిస్తున్న యాపిల్..!
శాన్ఫ్రాన్సిస్కో: యాపిల్ నుంచి కొత్త గాడ్జెట్లు మార్కెట్లోకి వచ్చి నాలుగేళ్లవుతోంది. పాతికేళ్ల చరిత్రలో అత్యుత్తమ ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం(రేపు) కాలిఫోర్నియాలోని క్యూపెర్టినోలో యాపిల్ నిర్వహిస్తున్న ‘ప్రత్యేక కార్యక్రమం’ ప్రపంచమంతటా ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించబోయే నూతన గ్యాడ్జెట్లు, వాటి ఫీచర్ల గురించి మార్కెట్ వర్గాల అంచనాలు ఇలా ఉన్నాయి... ఐవాచ్: స్మార్ట్‌వాచ్‌ను యాపిల్ తయారుచేస్తోందంటూ కొన్నేళ్లుగా విన్పిస్తున్న ఊహాగానాలు మంగళవారం వాస్తవరూపం దాల్చే అవకాశం ఉంది. రెండు సైజుల్లో ఉండే ఈ వాచ్‌లలో ఫ్లెక్సిబుల్ స్క్రీన్ ఉంటుందనీ, ధరించే వారి ఆరోగ్యం, ఫిట్నెస్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుందనీ తెలిసింది. ఇది వచ్చే ఏడాది మార్కెట్లోకి రావచ్చు. ఐఫోన్ 6: యాపిల్ ఆదాయంలో సగానికిపైగా స్మార్ట్ఫోన్ల నుంచే వస్తోంది. మరింత పెద్ద స్క్రీన్లు, సన్నని డిజైన్‌తో రెండు స్మార్ట్ఫోన్లను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. ఐఫోన్ 6ను 5.5 అంగుళాలు, 4.7 అంగుళాల స్క్రీన్లతో తీసుకురావచ్చు. గీతలు పడని, మరింత దృఢమైన సఫైర్ మెటీరియల్‌తో స్క్రీన్‌ను కంపెనీ రూపొందిస్తోందని కూడా భావిస్తున్నారు. మొబైల్ వాలెట్: వీసా, మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ క్రెడిట్ కార్డ్ కంపెనీలతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకుందని అంటున్నారు. ఐఫోన్, స్మార్ట్‌వాచ్‌లలో ఉండే ప్రత్యేక కమ్యూనికేషన్ చిప్ ద్వారా షాపింగ్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తారని సమాచారం. హెల్త్: ఈ ఏడాది ప్రవేశపెట్టిన ‘హెల్త్‌కిట్’ ద్వారా వినియోగదారులకు ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించనుంది. ఐఫోన్ 6లో హెల్త్కిట్ను అమ ర్చడం, శారీరక కదలికలు, హృదయ స్పందనను పర్యవేక్షించే సెన్సార్లను స్మార్ట్‌వాచ్‌లో ఏర్పాటు చేయడం ద్వారా మొబైల్ హెల్త్‌కేర్‌కు నాంది పలకనుంది. -
ఐఫోన్ 6 వచ్చేస్తోంది..
శాన్ఫ్రాన్సిస్కో: మొబైల్ ఫోన్లలో యాపిల్ ఐఫోన్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. చైనాలో ఒక యువకుడు ఈ ఫోన్ కొనడం కోసం తన కిడ్నీను విక్రయించడమే దీనికి నిదర్శనం. స్మార్ట్‌ఫోన్ అంటే యాపిల్ ఐఫోన్ అని చాలా మంది భావిస్తారు. సాధారణంగా యాపిల్ కంపెనీ ఐఫోన్లలో కొత్త వెర్షన్‌ను ప్రతి ఏటా సెప్టెంబర్‌లో విడుదల చేస్తోంది. ఈ ఆనవాయితీ ప్రకారమే ఈ ఏడాది సెప్టెంబర్‌లో (బహుశా 19 వ తారీఖు)ఐఫోన్ 6ను మార్కెట్లోకి అందించాలని యాపిల్ ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ యాపిల్ ఐఫోన్ 6 ఎలా ఉండబోతోందో అన్న చర్చలు బాగా జరుగుతున్నాయి. స్క్రీన్ సైజు ఎంత ఉండొచ్చు, ఏమేం ఫీచర్లుంటాయి, తదితర అంశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఐఫోన్ 6కు సంబంధించి వార్తలు, వదంతులు, లీకేజ్‌లు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. 4.7 అంగుళాల సైజ్ స్క్రీన్ ఉండొచ్చని, 113 గ్రాముల బరువుంటుందని.. ఇలా రకరకాలుగా ఇంటర్నెట్లో వార్తలు వస్తున్నాయి. అప్పుడే అనుకరణలు మొదలు యాపిల్ ఐఫోన్లో కొత్త మోడల్ ఐఫోన్ 6 రావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయినప్పటికీ, ఐఫోన్ 6కు నకళ్లు మాత్రం జోరుగా తయారవుతున్నాయని సమాచారం. ఇంటర్నెట్ ద్వారా ఐఫోన్ 6 గురించి పలు అంశాలు లీక్ అవుతున్నాయి. అనేక వదంతులు విస్తరిస్తున్నాయి. ఈ లీక్‌లు, వదంతులను ఆధారం చేసుకొని ఐఫోన్ 6 ఎలా ఉండబోతోందో కొన్ని మొబైల్ కంపెనీలు అంచనాలు వేస్తున్నాయి. ఈ అంచనాలు ఆధారంగా ఐఫోన్ 6కు నకలు ఫోన్‌ను అవి రూపొందిస్తున్నాయి. ఐఫోన్ 6 మార్కెట్లోకి వచ్చిన వారం రోజుల్లోనే దానికి నకిలీలు రావచ్చు. పెద్ద స్క్రీన్..: పెద్ద సైజు స్క్రీన్ ఉన్న ఐఫోన్‌ను మార్కెట్లోకి తేవాలని యాపిల్ కంపెనీ భావిస్తోంది. 2 నెలల్లో పెద్ద సైజ్ ఐఫోన్‌ను అందించడం సాధ్యం కాదని, అందుకే ముందుగా 4.7 అంగుళాల సైజు స్క్రీన్ ఉన్న ఐఫోన్‌ను అందించాలని, ఆ తర్వాత 5.5 అంగుళాల సైజు స్క్రీన్ ఉన్న ఐఫోన్‌ను అందుబాటులోకి తేవాలని కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఐవాచ్ కూడా..: ఈసారి ఐవాచ్‌ను అందించాలని యాపిల్ సీఈవో టిమ్ కుక్ భావిస్తున్నట్లు సమాచారం. యాపిల్ స్మార్ట్-వాచ్‌కు డిమాండ్ పెరుగుతోందని, అందుకని ఐవాచ్ అందిస్తే బావుంటుందన్న అంచనాలతో యాపిల్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందని విశ్లేషకులంటున్నారు. శామ్సంగ్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌ను ఇప్పటికే అందిస్తున్న తెలిసిందే.