దీపావళికి ఐఫోన్ 6 రానట్లే! | No Diwali launch for Apple iPhone 6 and iPhone 6 Plus in india | Sakshi
Sakshi News home page

దీపావళికి ఐఫోన్ 6 రానట్లే!

Published Tue, Sep 30 2014 2:14 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

దీపావళికి ఐఫోన్ 6 రానట్లే! - Sakshi

దీపావళికి ఐఫోన్ 6 రానట్లే!

కోల్కతా : ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్6 వినియోగదారులకు ఇది నిరాశ కలిగించే వార్తే. భారత్లో ఈ ఫోన్ విడుదల మరింత ఆలస్యం కానుంది.  అమెరికా, చైనా మార్కెట్ల నుంచి ఐఫోన్‌ 6, 6 ప్లస్‌లకు విపరీతమైన డిమాండ్‌ రావడంతో ఇండియాలో ఫోన్‌ విడుదలను నెల పాటు వాయిదా వేయాలని అమెరికాలోని యాపిల్‌ సంస్థ భావిస్తోంది. దాంతో ముందుగా అనుకున్నట్లు దీపావళికి ఐఫోన్ 6 విడుదల కానట్లే.  ఈ నేపథ్యంలో  నవంబర్లో ఈ ఫోన్ మన మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.  ఆంగ్ల దినపత్రిక ఎకనమిక్స్ టైమ్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

అయితే  భారత్ లో దీపావళి ముఖ్యమైన పండుగ. ఈ సమయంలో ఐఫోన్‌ 6ను విడుదల చేస్తే అమ్మకాలు బాగుండాయని... యాపిల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ పేరెంట్ కంపెనీకి విజ్ఞప్తి చేస్తోంది. వాస్తవానికి యాపిల్ సంస్థ అక్టోబరు 19న ఐఫోన్‌ను మన దేశంలో విడుదల చేద్దామనికుంది. అయితే ఫోన్‌ విడుదల అయిన తొలి మూడు రోజుల్లోనే కోటి ఐఫోన్లు అమ్ముడు కావటంతో యాపిల్‌ మేనేజ్‌మెంట్‌కు డిమాండ్‌ను అందుకోవడం కష్టంగా ఉంది. ఈ కారణంగా ఇండియా సహా మరికొన్ని దేశాల్లో ఐఫోన్‌ 6 విడుదలను వాయిదా వేయాలని యాపిల్‌ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement