యాపిల్ ఐఫోన్ 6 హల్చల్ | Apple fans queue to be the first to own an iPhone 6 | Sakshi
Sakshi News home page

యాపిల్ ఐఫోన్ 6 హల్చల్

Published Sat, Sep 20 2014 9:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

యాపిల్ ఐఫోన్ 6 హల్చల్

యాపిల్ ఐఫోన్ 6 హల్చల్

యాపిల్ ఐఫోన్ 6 హల్చల్ చేస్తోంది. శుక్రవారం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన యాపిల్ ఐఫోన్ 6 స్మార్ట్ఫోన్లను ముందుగా కొనుగోలు చేసిన  జర్మనీకి చెందిన కస్టమర్లు ఆనందంతో మునిగి తేలారు. అత్యాధునిక ఫీచర్లను పొందుపర్చి 4.7 అంగుళాలు, 5.5 అంగుళాల స్క్రీన్తో ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మోడల్స్ను యాపిల్ గతవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

తాజాగా శుక్రవారం నుంచి అమెరికా, జర్మనీ తదితర దేశాల్లోని వీటి అమ్మకాలు ప్రారంభించింది. అక్టోబర్ 17న ఇవి భారత్ మార్కెట్లోకి అధికారికంగా రానున్నాయి. ఆన్లైన్లోనూ, బ్లాక్ మార్కెట్లోనూ ఈ ఫోన్ల ధర అక్షరాలా రూ.1లక్ష దాకా పలుకుతోంది.

ఇక భారత్‌లో వీటి రాక కాస్త ఆలస్యం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్లను దక్కించుకునేందుకు యాపిల్ అభిమానులు భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ఐఫోన్‌లను అందరికన్నా ముందుగా దక్కించుకునేందుకు    యాపిల్ అభిమానులు భారీ రేటు కూడా ఇచ్చేందుకు సిద్ధపడుతుంటే.. మరోవైపు ముందుగా చెప్పిన సమయానికి ఈ హ్యాండ్‌సెట్స్ అందుబాటులోకి రాకపోవచ్చన్న ఊహాగానాలూ వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement