హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా నియమితులైనందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సమాచార కమిషనర్లుగా డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, లాం తాంతియాకుమారి, ఎస్.ఇంతియాజ్ అహ్మద్, ఎం.విజయనిర్మల నియామకం చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ నలుగురు సుప్రీం కోర్టును ఆశ్రయించగా 2013 అక్టోబర్‌లో స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు.. తాజాగా గురువారం జరిగిన తుది విచారణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 06.02.2013న ఈ నలుగురు సమాచార కమిషనర్ల నియామకానికి సంబంధించి జీవోనంబరు 75ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ నియామకాన్ని సవాలు చేస్తూ హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి పద్మనాభరెడ్డి, రావు చెలికాని 25 మార్చి 2013న హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
అఫిడవిట్‌లు మాత్రమే.. ఆధారాలు లేవు
‘‘31 జనవరి 2012న ఈ నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఉప ముఖ్యమంత్రితో కూడిన కమిటీ సమా వేశమై సమాచార కమిషనర్లుగా నియమించేం దుకు 8 పేర్లతో గవర్నర్‌కు ప్రతిపాదన పంపింది. ఈ 8 పేర్లలో నలుగురి పేర్లను గవర్నర్ ఆమోదించారు. సి.మధుకర్‌రాజు, ఎస్.ప్రభాకర్‌రెడ్డి, పి.విజయ్‌బాబు, ఎం.రతన్ŒS ల పేర్లను ఆమోదించిన గవర్నర్... డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, తాంతియాకుమారి, ఎస్.ఇంతియాజ్ అహ్మద్, ఎం.విజయనిర్మల పేర్లను తిరస్కరించారు.
కమిటీ రెండోసారి సమావేశమై ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించకుండా అవే పేర్లను తిరిగి పంపించింది. ఈ నేపథ్యంలో 2013 ఫిబ్రవరి 6న వీరి నియామకంపై ప్రభుత్వం జీవో వెలువరించింది.. అయితే ఈ నలుగురు తమ తమ రాజకీయ పార్టీలకు రాజీనామా చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అఫిడవిట్‌లో తమకు ఏ పార్టీతో సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే బార్ కౌన్సిల్ నుంచి ఐదేళ్ల పాటు సభ్యత్వ సస్పెన్షన్ లేఖ తెచ్చుకోలేదు. ఈ కారణాల రీత్యా వీరి నియామకాలను రద్దు చేయాలి..’’ అని వారు పిటిషన్‌లో కోరారు.
సమాచార కమిషనర్ల నియామకం చెల్లదు
Published Fri, Apr 21 2017 2:37 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement