తడిచినా, కిందపడినా ఈ మొబైల్ పాడుకాదట! | Archos 50 Saphir With IP68 Certification, 5000mAh Battery Launched Ahead of IFA | Sakshi
Sakshi News home page

తడిచినా, కిందపడినా ఈ మొబైల్ పాడుకాదట!

Published Fri, Sep 2 2016 3:40 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

తడిచినా, కిందపడినా ఈ మొబైల్ పాడుకాదట!

తడిచినా, కిందపడినా ఈ మొబైల్ పాడుకాదట!

ప్రముఖ మొబైల్ తయారీ దారు ఆర్కోస్ మరో సరికొత్త మొబైల్ ను విడుదల చేసింది. 'ఆర్కోస్ 50 సాఫిర్' ను   పేరుతో ఈ నూత‌న స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది.  ఐపీ 68 సర్టిఫైడ్ తమ  మొబైల్ పైనుంచి పడినా , ఒక మీటరు లోతు నీళ్లలో  అరగంట సేపు ఉంచినా పాడైపోదని కంపెనీ చెబుతోంది.  99  యూరోలు( సుమారు రూ.7,500)లుగా దీనికి ధరనునిర్ణయించింది.   జ‌ర్మనీలోని  బెర్లిన్‌లో జరుగుతున్న 'ఐఎఫ్ఏ 2016' ఎల‌క్ట్రానిక్స్ ట్రేడ్ షో లో  కూడా దీన్ని ప్రదర్శనకు ఉంచింది. ఈ డివైస్  అక్టోబర్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానుంది.

ఆర్కోస్ 50 సాఫిర్ ఫీచ‌ర్లు...

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సెల్  స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.5 గిగా హెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెస‌ర్‌,
2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంట‌ర్నల్  స్టోరేజ్‌,
128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
13  ఎంపీ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఐపీ68 స‌ర్టిఫైడ్ వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement