ఎవరేమనుకున్నా పర్లేదు: సీఎం
పాట్నా: ఆర్జేడీ నాయకులు విమర్శలపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం స్పందించారు. ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని అన్నారు. బీహార్ ప్రజలకు తనపై నమ్మకం ఉంచారని.. వారికి అనుగుణంగా తాను పనిచేస్తున్నానని తెలిపారు. మిత్రపక్షం నేతల విమర్శలను తాను పట్టించుకోనని ఆయన అన్నారు.
రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్, మహమ్మద్ షహబుద్దీన్ లు... నితీశ్ కుమార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నితీశ్ ను ముఖ్యమంత్రిగా చేయాలని కూటమి తీసుకున్న నిర్ణయాన్ని తాను అంగీకరించలేదని సింగ్ పేర్కొనడం విశేషం.
హత్య కేసులో 11ఏళ్ల పాటు జైలుశిక్ష అనుభవించి విడుదలైన షహబుద్దీన్ తన లీడర్ లాలూ ప్రసాద్ అని చెప్పడం బీహార్ లో రాజకీయ దుమారాన్ని లేపింది. పరిస్థితుల కారణంగానే నితీశ్ ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనెప్పుడు తన లీడర్ కాలేరని షహబుద్దీన్ పేర్కొన్నారు. కాగా ఆర్డేడీ-జేడీయూల మధ్య పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.