బీజేపీకి వాజపేయి మేనకోడలు రాజీనామా | Atal Bihari Vajpayee's niece Karuna Shukla quits BJP | Sakshi
Sakshi News home page

బీజేపీకి వాజపేయి మేనకోడలు రాజీనామా

Published Sat, Oct 26 2013 7:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Atal Bihari Vajpayee's niece Karuna Shukla quits BJP

రాయపూర్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు చత్తీస్గఢ్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మేనకోడలు, మాజీ ఎంపీ కరుణా శుక్లా.. బీజేపీకి రాజీనామా నేడు చేశారు. సీనియర్ నాయకులు తనను నిర్లక్ష్యం చేస్తుండడంతో ఆమె పార్టీని వదిలిపెట్టారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్కు పంపారు.

రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని, దీంతో తాను కలత చెందానని కరుణా శుక్లా వాపోయారు. గతంలో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు. చత్తీస్గఢ్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించడంతో బీజేపీ ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement