
పుత్తడి తనఖాపై రూ. 1 లక్ష వరకూ రుణాలు
ముంబై: పుత్తడి ఆభరణాలు తనాఖాగా రూ. 1 లక్ష వరకూ రుణాలివ్వడానికి బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ అనుమతిచ్చింది. బ్యాంకుల సూచనల ఆధారంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయేతర అవసరాలకు బంగారాన్ని తనఖాగా ఈ రుణాలివ్వవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ రుణ మొత్తాన్ని ఒకేసారి ఏక మొత్తంలో వడ్డీతో సహా రుణ కాలపరిమితి తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణ కాలపరిమితి 12 నెలలు మించి ఉండకూడదని వివరించింది. బంగారం నాణేలు, గోల్డ్ ఈటీఎఫ్‌లపై రుణాలివ్వడాన్ని నిషేధిస్తూ ఆర్‌బీఐ ఈ ఏడాది మేలో ఉత్తర్వులు జారీ చేసింది.