పాకిస్థాన్ రాక్షసకాండపై భారత్ ఫైర్ | Beheading of soldiers: Outraged India summons Pak envoy | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ రాక్షసకాండపై భారత్ ఫైర్

Published Wed, May 3 2017 3:03 PM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM

పాకిస్థాన్ రాక్షసకాండపై భారత్ ఫైర్ - Sakshi

పాకిస్థాన్ రాక్షసకాండపై భారత్ ఫైర్

- బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తూ పాక్ రాయబారికి సమన్లు
న్యూఢిల్లీ:
దాయాది రాక్షసకాండపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. భారత జవాన్లను ఆటవికంగా హతమార్చినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ బుధవారం ఢిల్లీలో పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ బాసిత్ ను పిలిపించుకుని ఈ మేరకు సమన్లు జరీచేశారు. పాక్ సైనికులు, ఉగ్రవాదులు కలిసే.. భారత జవాన్ల తలలు నరికారని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని భారత్ పేర్కొంది.

పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల కలయికగా ఏర్పడిన బార్డర్ యాక్షన్ టీమ్(బ్యాట్).. మే 1న భారత భూభాగంలోకి చొరబడి గస్తీ కాస్తోన్న ఇద్దరు జవాన్లను అతి కిరాతకంగా చంపేసిన ఘటన సంచలన రేపిన సంగతి తెలిసిందే. హత్యాకాండ అనంతరం బ్యాట్ సభ్యులు తిరిగి పాకిస్థాన్ కు వెళ్లిపోయారు. అయితే వారు నడిచివెళ్లిన దారి వెంబడి కొన్ని రక్తపు నమూనాలు సేకరించామని, హత్యకు గురైన సైనికుల రక్తనమూనాలతో అవి సరితూగాయని, దీన్నిబట్టి హంతకులు ముమ్మాటికీ పాక్ నుంచి వచ్చినవారేనని పాక్ రాయబారికి వివరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

సుబేదార్ పరమ్ జీత్ సింగ్, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ లు మే 1రాత్రి పూంఛ్ సెక్టార్ లో కమ్యూనికేషన్ కేబుల్స్ పరీక్షించే పనిలో ఉండగా వారిని పాకిస్థాన్ బ్యాట్ బృందం చుట్టుముట్టింది. జవాన్లను దారుణంగా హతమార్చడమేకాక తలలు వేరుచేసి కిరాతకాన్ని చాటుకుంది. తర్వాతి రోజు ఉదయానికిగానీ జవాన్ల మృతదేహాలను సహచరులు గుర్తించారు.
(50 మంది పాక్‌ సైనికుల తలలు కావాలి)

(పాక్ బరితెగింపు: ముక్కలుగా జవాన్ల దేహాలు!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement