వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ డిప్యూటీ మేయర్ | Bihar town deputy mayor held with two call girls | Sakshi
Sakshi News home page

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ డిప్యూటీ మేయర్

Published Tue, Jan 7 2014 12:39 PM | Last Updated on Sat, Aug 25 2018 6:52 PM

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ డిప్యూటీ మేయర్ - Sakshi

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ డిప్యూటీ మేయర్

వ్యభిచారం చేస్తూ ఓ డిప్యూటీ మేయర్ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోయిన సంఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పాట్నా నగరంలోని అత్యంత ఖరీదైన హోటల్లో గత అర్థరాత్రి నిర్వహించిన తనిఖీలలో గయా నగర డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవాతోపాటు ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు.

 

వారితోపాటు మరో ముగ్గురుని కూడా అదుపులోకి తీసుకుని కోత్వాలి పోలీసు స్టేషన్కు తరలించి విచారిస్తున్నామని చెప్పారు. పాట్నా నగరంలోని అత్యంత ప్రముఖ హోటల్లో వ్యభిచారం జరగుతుందని తమకు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అందులోభాగంగా వారందరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement