కేబీఆర్ పార్క్‌లో ‘బయోమెట్రిక్’ ప్రారంభం | Biometric policy to lnagurated by SBL mishra at KBR park | Sakshi
Sakshi News home page

కేబీఆర్ పార్క్‌లో ‘బయోమెట్రిక్’ ప్రారంభం

Published Sun, Aug 16 2015 6:53 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

బయోమెట్రిక్ బార్‌కోడింగ్ విధానాన్ని ప్రారంభిస్తున్న తెలంగాణ ప్రధాన ముఖ్య అటవీసంరక్షణాధికారి ఎస్‌బీఎల్ మిశ్రా

బయోమెట్రిక్ బార్‌కోడింగ్ విధానాన్ని ప్రారంభిస్తున్న తెలంగాణ ప్రధాన ముఖ్య అటవీసంరక్షణాధికారి ఎస్‌బీఎల్ మిశ్రా

బంజారాహిల్స్ (హైదరాబాద్): బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కులో బయోమెట్రిక్ విధానాన్ని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఎస్‌బీఎల్. మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ విధానంలో వాకర్లు పాస్ మర్చిపోతే వేలి ముద్ర ద్వారా లోనికి ప్రవేశించవచ్చన్నారు. బయోమెట్రిక్, బార్‌కోడ్, ఆర్‌ఎఫ్‌ఐడీ, పాస్‌వర్డ్ ఇలా నాలుగు విధాలుగా ప్రవేశించేందుకు వీలు కల్పించినట్టు తెలిపారు.

మొత్తం 3,850 మంది వాకర్లకు బయోమెట్రిక్ బార్‌కోడింగ్ పాస్‌లను అందజేసినట్లు వెల్లడించారు. రెండు మెషిన్లు ప్రధాన ద్వారం వద్ద, మరో మెషిన్ రెండో గేటు వద్ద అమర్చామన్నారు. పార్కులో 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, కేబీఆర్ పార్కు తరహాలో హెచ్‌ఎండీఏ పరిధిలో మరో 10 పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు మిశ్రా చెప్పారు. ఇందుకోసం రూ. 50 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement