బీజేపీకి మమత వార్నింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ తమ పార్టీని లక్ష్యంగా చేసుకుంటే.. తాము దేశమంతా బీజేపీని టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. బీజేపీ బెంగాల్‌ను టార్గెట్ చేస్తేనే తాము దేశాన్ని లక్ష్యంగా చేస్తామని భావించవద్దని.. ఆ పార్టీ బెంగాల్, ఒడిశా, బిహార్‌లను టార్గెట్ చేసినా.. తాము ఎదుర్కొంటామని చెప్పారు.
బీజేపీ తమ పార్టీని ఏమీ చేయలేదని, రాష్ట్రంలో మూడో లేదా నాలుగో స్థానంలో ఉన్న ఆ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని, దౌర్జన్యంతో అధికారంలోకి వస్తుందా అని మమత ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మమతను ఎదుర్కొనేందుకు బీజేపీ వ్యూహం రచిస్తోందా అన్న ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. విభజించి పాలించే రాజకీయాలకు బెంగాల్‌లో స్థానం లేదని మమత పేర్కొన్నారు. బెంగాల్‌పై తనకు పూర్తి నమ్మకముందని, బీజేపీ నేతలు ఏం చెప్పినా బెంగాలీలు నమ్మరని అన్నారు.