
ప్రకాష్ జవదేకర్
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై నిర్ణయాలనూ ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకారంతోనే తీసుకున్నామని ఆ స్కాంలో ప్రధాన నిందితుడు, టెలికం మాజీ మంత్రి ఎ.రాజా కోర్టుకు చెప్పిన నేపథ్యంలో సీబీఐ ప్రధాని మన్మోహన్ సింగ్ను కూడా ప్రశ్నించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాజా వాంగ్మూలం దిగ్భ్రాంతికరమని, ప్రధానిని విచారించకపోతే దర్యాప్తు పూర్తి కాదని పార్టీ ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.
ఆ కుంభకోణంలో ప్రధాని ప్రమేయం ఉందని స్పష్టమైందని, ఈ వ్యవహారంపై ఆయన దేశానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బొగ్గు కుంభోణాన్ని ప్రస్తావిస్తూ, ప్రధాని ఆదేశాల మేరకే బొగ్గు గనుల కేటాంపులపైనా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.