న్యూఢిల్లీ : హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రమ్మంటేనే ఢిల్లీ వచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రి వట్టి వసంత్ కుమార్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఏం నివేదిక ఇస్తారో తనకు తెలియదని ఆయన మంగళవారమిక్కడ అన్నారు.
కాగా రాష్ట్ర విభజనపై ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా జీవోఎం సమావేశాని వట్టి, దామోదర హాజరు అవుతున్నారు. మరోవైపు కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముందే సుశీల్ కుమార్ షిండేతో బొత్స సత్యనారాయణ సమావేశమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.