
రూ. 200 కోసం కొడుకును పొడిచాడు
సహరన్పూర్: మద్యానికి బానిసైన తండ్రి తనకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడానే కోపంతో కన్న కొడుకునే (17) పొడిచాడు. ఉత్తరప్రదేశ్లో సహరన్పూర్ జిల్లాలోని దేవ్బండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.
మద్యం తాగేందుకు 200 రూపాయలు ఇవ్వాల్సిందిగా బాదర్.. తన కొడుకు అహ్మద్ను అడిగినట్టు పోలీసులు చెప్పారు. ఇందుకు అహ్మద్ నిరాకరించడంతో బాదర్ కత్తెర తీసుకుని అతణ్ని పలుమార్లు పొడిచినట్టు తెలిపారు. అనంతరం బాదర్ పరారయ్యాడు. అహ్మద్ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.