‘క్యాల్షియం’తో తస్మాత్ జాగ్రత్త | Calcium Supplements May Not Be Heart Healthy | Sakshi
Sakshi News home page

‘క్యాల్షియం’తో తస్మాత్ జాగ్రత్త

Published Thu, Oct 13 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

‘క్యాల్షియం’తో తస్మాత్ జాగ్రత్త

‘క్యాల్షియం’తో తస్మాత్ జాగ్రత్త

శరీరంలోని క్యాల్షియం లోటును భర్తీ చేసేందుకు చాలామంది క్యాల్షియం మాత్రలు వాడుతుంటారు. అయితే ఇలా ట్యాబ్లెట్లల రూపంలో క్యాల్షియంను ఎక్కువగా తీసుకుంటే గుండె రక్తనాళాల్లో ప్లేక్ పేరుకుపోయే ప్రమాదం ఎక్కువవుతుందని, తద్వారా గుండె దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉందని జాన్ హాప్కిన్స్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాదాపు 2,700 మంది పదేళ్ల వైద్య రికార్డులను పరిశీలించిన అనంతరం వారు ఈ అంచనాకు వచ్చినట్లు వివరించారు.
 
 ఎముకలు బలహీనపడడాన్ని నివారిస్తుందన్న అపోహతో చాలామంది వైద్యుల సలహా లేకుండానే క్యాల్షియం ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉంటారని, కానీ దీనివల్ల గుండెకు చేటన్నది చాలా మందికి తెలియదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న ఎర్నిన్ మిచోస్ అంటున్నారు. శరీరంలో అవసరానికి మించి ఉండే క్యాల్షియం మృదు కణజాలంలో పేరుకుపోతుందని ఇప్పటికే తెలిసిన విషయమే కానీ దీంతోపాటు గుండె రక్తనాళాల్లో ఎక్కువగా ప్లేక్ పేరుకుపోతున్నట్లుగా కూడా గుర్తించామని ఎర్నిన్ వివరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement