జేఈఈ మెయిన్స్- 2015 ఫలితాల విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న పలు ఐఐటీలలో ప్రవేశం కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)- మెయిన్స్ ఫలితాలను సీబీఎస్ఈ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. www.cbseresults.nic.in వెబ్సైట్లో ఈ ఫలితాలను ఉంచారు. కేవలం స్కోరు కార్డు మాత్రమే సోమవారం నాడు అందులో ఇస్తున్నారు.
ఈ ఏడాది సుమారు 13 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాశారు. వాళ్లలో అర్హత సాధించినవారు మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు రాయడానికి వీలుంటుంది. వాటిలో కూడా మంచి ర్యాంకులు సాధిస్తేనే ఐఐటీలలో ప్రవేశం దక్కుతుంది. ఒకవేళ అడ్వాన్స్డ్ పరీక్షలో మంచి ర్యాంకు రాకుండా.. మెయిన్స్లో మాత్రం తగు ర్యాంకు వస్తే వారికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లలో ప్రవేశం వస్తుంది.