
ఈ నెల 7న చలో అసెంబ్లీ
బీసీ డిమాండ్లపై సీఎం ఇచ్చిన మాట ప్రకారం బీసీ మంత్రులు శాసనసభ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెల్లడి
హైదరాబాద్: బీసీ డిమాండ్లపై సీఎం ఇచ్చిన మాట ప్రకారం బీసీ మంత్రులు శాసనసభ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ 10 వేల కోట్లతో బీసీలకు సబ్ ప్లాన్, కల్యాణ లక్ష్మి పథకాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో తమ ఉద్యమాల ఒత్తిడి మేరకు బీసీ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేసినా.. వాటి అమలును ఆ ప్రభుత్వాలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాయన్నారు.
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ నేతలు శారదాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.