పక్కింటివారి పనేనా..! | Child Lasya Brutal murder | Sakshi
Sakshi News home page

పక్కింటివారి పనేనా..!

Published Sun, Oct 18 2015 3:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

పక్కింటివారి పనేనా..!

పక్కింటివారి పనేనా..!

* చిన్నారి లాస్య దారుణ హత్య
* పక్కింట్లో మృత దేహం లభ్యం
* నిందితులపై స్థానికుల దాడి
సనత్‌నగర్: ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారి లాస్యను ఎత్తుకెళ్లి హత్య చేసిన కేసులో పక్కింటివారే పక్కింటివారే ఆ ఘాతుకానికి పాల్పడినట్లుగా చిన్నారి కుటుంబసభ్యులు, స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా సనత్‌నగర్ పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

వివరాల్లోకి వెళితే దీన్‌దయాల్‌నగర్‌కు చెందిన నవీన్, మయూరి దంపతుల కుమార్తె లాస్య(3.5 ఏళ్లు) బుధవారం రాత్రి అన్నం తిని ఆడుకునేందుకు బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్ల వద్ద వాకబు చేసిన ఫలితం లేదు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి వారి పక్కింట్లో దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా మూట కనిపించడంతో దానిని విప్పి చూడగా లాస్య మృతదేహం కనిపించింది.

దీంతో కోపానికి గురైన కాలనీ వాసులు ఇంటిలో ఉన్న యాదమ్మ, లక్ష్మయ్య, గిరి, పద్మలను చితకబాదారు. తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే లాస్యను చంపి ముక్కలు ముక్కలు చేసి బయటపడేయడానికి పథకం పన్నారని, అయితే అందుకు వీలు కాకపోవడంతో గోనె సంచిలో వేసి ఇంట్లో ఉంచినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.  విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేస్తామని సనత్‌నగర్ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement