చంద్రుడి మీదకు మానవరహిత అంతరిక్ష నౌక
Published Fri, Oct 24 2014 9:45 PM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM
చైనా: చంద్రుడి మీదకు మానవ రహిత అంతరిక్ష నౌకను సిష్వాన్ ప్రాంతంలోని షిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి చైనా దేశం శుక్రవారం ప్రయోగించింది. చంద్ర మండలంపైకి చైనా తొలి ప్రయోగం చేసింది. చంద్రమండలంపైకి ప్రయోగించిన అంతరిక్ష నౌకకు ఎలాంటి పేరును పెట్టలేదు.
చంద్రుడి కక్ష్య చుట్టూ తిరిగాక స్పేస్ క్రాఫ్ట్ భూమికి దిగి రానుంది. మానవ రహిత అంతరిక్ష నౌకను ప్రయోగించిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ వెలుపల కొన్ని సమస్యలు తలెత్తినట్టు చైనా అంతరిక్ష పరిశోధకులు వెల్లడించారు. దాంతో ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత చంద్రుడి కక్ష్య గమనాన్ని శాస్త్రజ్క్షులు తగ్గించినట్టు తెలుస్తోంది.
Advertisement