ఎఫ్-35 జెట్లపై ట్రంప్ గగ్గోలు
అమెరికా అధ్యక్షపదవికి ఎంపికైన డోనాల్డ్ ట్రంప్ సోమవారం మరో రక్షణ శాఖ అంశంపై విమర్శలు గుప్పించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షపదవికి ఎంపికైన డోనాల్డ్ ట్రంప్ సోమవారం మరో రక్షణ శాఖ అంశంపై విమర్శలు గుప్పించారు. దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తూ మార్పులు చేసుకుంటూ వస్తున్న ఎఫ్-35 జెట్ల వ్యయం రోజు రోజుకూ పెరిగిపోతోందని ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఎఫ్-35 ప్రోగ్రామ్ వ్యయం చేయి దాటి పోతోందని, జనవరి 20 తర్వాత బిలియన్ల డాలర్లను వృథా కానివ్వనని అన్నారు.
ట్రంప్ ట్వీట్ తో ఏరోస్పేస్ మార్కెట్ ఒక్కసారిగా 2.6శాతం కుప్పకూలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు లాక్ హీడ్ మార్టిన్ ఎఫ్-35లకు 6.1 బిలియన్ డాలర్లను అమెరికా ప్రభుత్వం మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్వీట్ అమెరికా రక్షణ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది.