
పవన్ హన్స్ హెలికాప్టర్ శకలాలు గుర్తింపు
న్యూఢిల్లీ: ఇటీవల అసోంలోని డిబ్రుగఢ్ నుంచి బయల్దేరి ఆపై ఆచూకీ గల్లంతైన పవన్ హన్స్ హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. ప్రమాదానికి గురైన ఈ హెలికాప్టర్ శకలాను తిరాప్ జిల్లా ప్రధాన కేంద్రమైన దక్షిణ ఖోన్సా ప్రాంతానికి 12 కి.మీ దూరంలో గుర్తించినట్లు ఎయిర్ ఫోర్స్ వర్గాలు తాజాగా నిర్దారించాయి. ఆగస్టు 4 వ తేదీన నలుగురితో బయల్దేరిన పవన్ హన్స్ హెలికాప్టర్ అదృశ్యమైంది.
దీనిపై కేంద్ర సహాయకమంత్రి కిరణ్ రిజ్జూ వివరణ ఇస్తూ. .పవన్ హన్స్ హెలికాప్టర్ శకలాలు లభించినట్లు స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనలో ఐఏఎస్ అధికారి కమలేష్ జోషితో సహా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు.