‘హుండీ’..హవా..! | Demonetization effect to Gulf migrants | Sakshi
Sakshi News home page

‘హుండీ’..హవా..!

Published Thu, Jul 27 2017 12:47 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

‘హుండీ’..హవా..! - Sakshi

‘హుండీ’..హవా..!

- జోరందుకున్న వ్యాపారం
పెద్ద నోట్ల రద్దు ప్రభావం
బ్యాంకుల్లో విత్‌డ్రా ఆంక్షలు
నష్టపోతున్న వలస పక్షులు
 
కోరుట్ల: గల్ఫ్‌ వలసలు ఎక్కువగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇటీవల హుండీ వ్యాపారం జోరందుకుంది. పెద్దనోట్ల రద్దు.. బ్యాంకుల్లో విత్‌డ్రాలపై పరిమితుల నేపథ్యంలో ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన వారు హుండీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గల్ఫ్‌ కరెన్సీ మారకంలో తక్కువ డబ్బులు వస్తున్నా.. ఒకేసారి పెద్ద మొత్తంలో నేరుగా ఇంటికి పంపే అవకాశం ఉండడంతో హుండీ వ్యాపారం ద్వారా డబ్బులు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. గతేడాది నవంబరులో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత బ్యాంకులు, ఏటీఎం నుంచి రోజు డబ్బులు విత్‌డ్రా చేసే అంశంలోనూ పరిమితులు విధించారు.

ఆ తర్వాత బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవడానికి ప్రజలు పడ్డ ఇబ్బందులు అందరికీ తెల్సినవే. కాగా, గల్ఫ్‌ వెళ్లిన వారు సాధారణంగా ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి తాము సంపాదించిన డబ్బులను ఇంటికి పంపుతుంటారు. బ్యాంకులకు ఈ డబ్బులు పంపితే ఒకేసారి విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడం.. రోజు బ్యాంకులకు వచ్చి ఇక్కడి వారు ఇబ్బందులు పడుతుండడంతో గల్ఫ్‌ నుంచి డబ్బులు పంపేవారు హుండీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. హుండీ వ్యాపారుల ద్వారా డబ్బులు పంపితే ఎన్ని డబ్బులు పంపితే అంత మొత్తం నేరుగా ఇంటికి చేరుతుండడంతో గల్ఫ్‌ వెళ్లిన వారు హుండీ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. 
 
అడ్డగోలు కమీషన్లు..
ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల రాజన్న, ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి పరిసర ప్రాంతాల నుంచి గల్ఫ్‌ దేశాలకు వలసవెళ్లిన వారు లక్షల్లో ఉన్నారు. ప్రస్తుతం వీరిలో చాలామంది తమ డబ్బులు హుండీ వ్యాపారుల ద్వారా ఇంటికి పంపుతున్నారు. సాధారణంగా గల్ఫ్‌ దేశాల నుంచి డబ్బులు బ్యాంకుల ద్వారా ఇంటికి పంపితే ఎక్ఛేంజీ భారం పడదు. ఉదాహరణకు సౌదీ నుంచి వంద ధర్హామ్‌లు ఇండియాకు బ్యాంకు ద్వారా పంపితే మారకం ప్రకారం రూ. 1,750 వస్తాయి. ఎంత డబ్బు పంపినా కేవలం ఇరవై ధర్హామ్‌లు మాత్రమే ఎక్ఛేంజీ కమీషన్‌ కింద సౌదీ బ్యాంకుల్లో తీసుకుంటారు.

కాగా, హుండీ నుంచి వంద ధర్హామ్స్‌(ఇండియా కరెన్సీ రూ.1,750) పంపితే ఇండియాలో రూ.1,650 –1,700 మాత్రమే అందిస్తారు. అంటే వంద ధర్హామ్స్‌కు సుమారు రూ. వంద వరకు కమీషన్‌ కింద హుండీ వ్యాపారులు కట్‌ చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇంత కంటే ఎక్కువే కట్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా గల్ఫ్‌ దేశాల నుంచి లక్షల్లో డబ్బులు పంపే వారు తీవ్రంగా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో హుండీని ఆశ్రయిస్తున్నారు. 
 
ముంబై కేంద్రంగా..
ముంబై కేంద్రంగా కొందరు గల్ఫ్‌ దేశాల్లో తమ ఏజెంట్లను నియమించి వ్యాపారం నడుపుతున్నారు. గల్ఫ్‌లో ఉన్న ఏజెంట్లు ఇండియాకు డబ్బులు పంపడానికి తమ వద్దకు వచ్చే వారి నుంచి కమీషన్‌ ముందుగానే కట్‌ చేసుకుంటారు. వారి చేతికి అక్కడి కరెన్సీ అందిన తర్వాత ముంబైలో ఉన్న హుండీ వ్యాపారికి సమాచారం ఇస్తారు. వీరు ఆ డబ్బులను ఆయా జిల్లాల్లో ఉన్న తమ ఏజెంట్ల ద్వారా బంధువులకు నేరుగా అందిస్తారు. ఈ దందాలో పెద్ద మొత్తంలో కమీషన్లు దండుకోవడంతో పాటు తమ వద్ద ఉన్న బ్లాక్‌ మనీ నేరుగా వైట్‌మనీగా మార్చుకోవడానికి హుండీ వ్యాపారులకు ఆస్కారం చిక్కుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement