ముఖంలో చిరునవ్వు మాయమైంది..!
ఎన్నో ఆశలు, ఆశయాలతో కాలేజీకి వచ్చా..
నేను ఇడియట్‌ని.. అందుకే వీరినందరినీ నమ్మా..
‘డైరీ’లో రాసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి
గుంటూరు: ఆడుతూ పాడుతూ గడిపిన పరిస్థితుల నుంచి ఒక్కసారిగా ఊహలకు అందని ప్రపంచంలోకి వచ్చింది. అదీ విభిన్న మనస్తత్వాలు కలిగిన యూనివర్సిటీలోకి. అంతా గందరగోళం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోలేకపోయింది. అమాయక నవ్వుల్ని అపార్థం చేసుకుంటారని తెలియని పసితనం. కొద్ది రోజుల్లోనే ఆశలన్నీ తలకిందులయ్యాయి. నమ్మిన వారే వెంటాడారు. అన్నీ చెప్పుకునే తండ్రికీ తన దురవస్థ చెప్పుకోలేని దుస్థితి. సరిగ్గా రెండు పదులూ నిండకుండానే నిరాశ.. నిస్పృహ.. అనిశ్చితి.. చివరికి ఆత్మహత్యను ఆసరాగా చేసుకుంది... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ కాలేజీ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషితేశ్వరి. ‘మై లాస్ట్ నోట్’ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఒక్క సూసైడ్‌నోటే ఉందని భావించగా.. తాజాగా ఆమె డైరీలో రాసుకున్న మరికొన్ని సంఘట నలు బయటపడడం చర్చనీయాంశంగా మా రింది. ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన వ్య క్తులు, అందుకు కారణమైన వాటినీ స్పష్టంగా పేర్కొంది. డైరీ రాసే అలవాటు ఉన్న రిషితేశ్వరి కాలేజీలో చేరినప్పటి నుంచీ తనకు బాధ కలిగించిన అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వీటిలో కొన్ని పేజీలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. అయితే, అందులో కొన్ని పేర్లు కొట్టివేసి ఉండడం అనుమానాలకు తావిస్తోంది.
ఆ రోజుతోనే సగం చచ్చినట్లైంది...
2014 ఏప్రిల్‌లో మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఉన్న హాయ్‌ల్యాండ్‌లో ఫ్రెషర్స్‌డే పార్టీ జరిగింది. పార్టీలో స్టేజీపై ఉన్న సమయంలో సీనియర్..... (పేరు కొట్టేసి ఉంది) ఒకరు మద్యం సేవించి నా చెయ్యి పట్టుకుని ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. షాక్‌కు గురయ్యా. స్టేజి దిగి కిందకు వెళ్లబోతుండగా మరో సీనియర్..... (పేరు కొట్టేసి ఉంది) నడుంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని అసభ్యంగా ప్రవర్తిం చాడు. ఆ సమయంలో అతడిని ప్రతిఘటించలేకపోయా. ఆ సంఘటనను ఊహించుకుంటే నాపై నాకే అసహ్యం వేస్తుంది. నాకేమైందో అర్థం కావడం లేదు. అన్ని విషయాలు నాన్నతో చెప్పుకునే నేను వీటిని చెప్పలేకపోయా. నేను సగం చచ్చినట్లైంది.
ఈ రోజు చాలా బాధపడుతున్నా. కాలేజీలోకి అడుగు పెట్టినప్పుడు చాలా ఆశలు, ఆశయాలతో వచ్చా. కానీ ఇప్పుడు చాలా భయాందోళనకు గురవుతున్నా. జీవితంపైన విరక్తి కలుగుతోంది. నమ్మిన అబ్బాయిలంతా మోసం చేశారు. అబ్బాయిలంతా ఇడియట్స్. ప్రతి ఒక్కరిని అసహ్యించుకుం టున్నా. మొదట...... (పేరు కొట్టేసి ఉంది) అతడిని మంచి స్నేహితుడని ఊహించా. మా నాన్న కూడా అతడిని నమ్మాడు. ఫిబ్రవరి 11న అతనితో వాట్సాప్‌లో ఉండగా అకస్మాత్తుగా ‘ఐ లవ్ యూ’ అని చెప్పాడు. అలా చెబుతాడని ఊహించలేదు. కాలేజీలో చేరిన తర్వాత ఇతను మొదటి స్నేహితుడు. ఆ తర్వాత అనేక ఫోన్‌నెంబర్ల నుంచి అస
అసహ్యమైన మెసేజ్‌లు పంపాడు. అతడిని పూర్తిగా అసిహ్యించుకున్నా. మంచి స్నేహితుడిగా భావించిన...... (పేరు కొట్టేసి ఉంది) వాడు వెధవే. నేను నిద్రావస్థలో ఉన్నప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడు. నా జీవితంలోనే ఇది అసహ్యమైన సందర్భం. నా జీవితం వృథా. ఎవరికిలేని విధంగా నాకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. అందుకే నన్ను నేను అసహ్యించుకుంటున్నా. నా సోదరుడు వంటి జితేంద్రకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. నేను కూతురునైనందుకు నాన్నకూ సమస్యలు తప్పడం లేదు. అందుకే చనిపోయినట్లుగా భావిస్తున్నా. ‘ ఐ లవ్‌యూ డాడ్’ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.
నేను నవ్వుతూ అందరితో కలుపుగోలుగా ఉండటం మొదలు పెట్టినప్పటి నుంచి కొత్త స్నేహితులు పరిచయం అవుతుండటం ఎంతో ఆనందం కలిగించింది. నాది చిన్నపిల్లల మనస్తత్వం. అందరినీ నమ్ముతా. ఎవరినైతే నమ్మానో వాళ్లందరూ ఫూల్‌ని చేశారు. నేను ఒక ఇడియట్‌ని.. ఇడియట్‌లందరినీ నమ్మా. నా ముఖంలో చిరునవ్వు మాయమైంది. మా నాన్నను ఎంతగానో ప్రేమిస్తున్నా.
........ (పేరు కొట్టేసి ఉంది) నాలుగో సంవత్సరం చదివే సీనియర్ విద్యార్థి,.......( పేరు కొట్టేసి ఉంది), రెండో సంవత్సరం చదివే సీనియర్ విద్యార్థినులు మంచి చేస్తున్నట్లు నటిస్తూనే నన్ను ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా సీనియర్ విద్యార్థిని ఎంతగానో సహకారం అందిస్తుందని భావించా. కానీ తను చాలా చెడ్డది. నా స మాచారాన్ని సీనియర్ విద్యార్థి శ్రీనివాస్‌కు చేరవేస్తుంది. అది తెలిసి షాక్‌కు గురయ్యా. నా ఫొటోలు, ప్రతిభ, కులం, మొదలగు సమాచారాన్నంతటిని అతనికి ఇచ్చింది. ఆమె అంత చెడ్డదని తెలిసి జీర్ణించుకోలేకపోయా. చాలా బాధపడ్డా. ఈ సంఘటన తర్వాత ఎవరినీ నమ్మలేదు.
రిషితేశ్వరి డైరీలో ఏం రాసిందంటే..!
ఈ డైరీ చదివిన వారి తల వెయ్యి వక్కలవుతుంది... అంటూ మొదలు పెట్టిన రిషితేశ్వరి వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా నడుచుకోవాలి, జీవితంలో ఉన్నతశిఖరాలు అధిరోహించాలంటే ఏం చేయాలనే అంశాలపై 250 వరకు కొటేషన్లు రాసుకుంది. ఆ తర్వాత భగవద్గీతలోని శ్లోకాలను ప్రస్తావించింది. తనకు నచ్చిన కథ పేరుతో తెలుగులో ఓ కథనూ రాసుకుంది. ఆ తర్వాత యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి ఆమెకు బాధకలిగించినప్రతి సంఘటననూ ఇంగ్లిష్‌లో పొందుపరిచింది. ఇతరుల డైరీ చదవకూడదు (ఇట్స్ ఏ క్రైమ్) అంటూ డైరీలో రాయడం ప్రారంభించింది.
తాను ఆరోతరగతి చదువుతున్న సమయంలో సాయంత్రం 5గంటలకల్లా ఇంటికి చేరేదాన్ని. నాన్న ఉద్యోగరీత్యా రాత్రి 9.30 గంటలకు వచ్చేవారు. అమ్మ బ్యూటీపార్లర్ మూసివేసి వచ్చేసరికి 9గంటలయ్యేది. అప్పటివరకు టీవీ చూస్తూ ఒంటరిగా గడిపేదాన్ని. ఆ సమయంలో ఒంటరిగా ఫీలవుతూ తీవ్రంగా ఆలోచించేదాన్ని. మా నాన్నంటే చాలా ఇష్టం.