
‘పరువు’ కేసులో కోర్టుకు కరుణ
చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వ పాలనపై విమర్శలకుగాను సీఎం జయలలిత దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణలో భాగంగా డీఎంకే అధినేత కరుణానిధి(92) సోమవారం వీల్‌చైర్‌లో కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను కోర్టు మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.
కరుణ వెంట ఆయన కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి తదితరులు కోర్టుకు వచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.