దిగ్విజయ్ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు: ఆశోక్ బాబు
హైదరాబాద్: రాష్ట్రవిభజనపై పార్లమెంటులో ఉన్న తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో కేంద్రం సమైక్య రాష్ట్రంపై స్పష్టమైన వైఖరిని ఇచ్చేవరకు ఉద్యమం ఆగదంటూ ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిగ్విజయ్ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదంటూ ఆయన మండిపడ్డారు.
సొంతపార్టీపై అవిశ్వాసం పెట్టిన సీమాంధ్ర ఎంపీలను అభినందిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని పార్టీలు సహకరించాలని అశోక్ బాబు కోరారు. అయితే సమైక్యానికి సహకరించని ఎంపీలకు మాత్రం సాంఘిక బహిష్కరణ తప్పదన్నారు.