లాఫింగ్ గ్యాస్‌ను కనిపెట్టింది ఎవరు? | Do you Know who invented the laughing gas ? | Sakshi
Sakshi News home page

లాఫింగ్ గ్యాస్‌ను కనిపెట్టింది ఎవరు?

Published Tue, Sep 29 2015 8:21 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

లాఫింగ్ గ్యాస్‌ను కనిపెట్టింది ఎవరు?

లాఫింగ్ గ్యాస్‌ను కనిపెట్టింది ఎవరు?

మనం నవ్వుతూ ఉండాలంటే ఒక ప్రత్యేకమైన వాయువును పీల్చితే చాలు కొన్ని గంటల పాటు నవ్వుతూనే ఉంటారు. నైట్రస్ ఆక్సైడ్ (N2O)  అనే ఈ వాయువును కనుగొన్న వ్యక్తి హంఫ్రీ డేవి. ఇతడు 1778 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌లోని పెన్‌జాన్స్‌లో  ఆయన తండ్రి పేద వడ్రంగి. అందువల్ల ఇంటి చుట్టుపక్కల స్కూళ్లల్లో చదువు సాగించాడు. అయినా చిన్నప్పుడు సైన్సు అంటే ఏ మాత్రం శ్రద్ధ, ఇష్టం చూపించేవాడు కాదు.
 
ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ఒక ఫార్మసిస్ట్ దగ్గర శిష్యుడిగా చేరాడు. ఆయన ఇంటి దగ్గర లైబ్రరీలో ఉన్న పుస్తకాలను విపరీతంగా చదివే వాడు హంఫ్రీ. ఆ సందర్భంలోనే పేరొందిన శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, వారి ఆవిష్కరణలు చదివాడు. ఆ ప్రేరణతో డేవీ రసాయనశాస్త్రంపై ఇష్టాన్ని పెంచుకుని ఆ దిశగా పనిచేయటం ప్రారంభించాడు. 1799లో లాఫింగ్ గ్యాస్‌ని కనుగొన్నాడు డేవి. ఎలక్ట్రోకెమికల్ టెక్నిక్ సహాయంతో దేవీ పొటాషియం, సోడియంని కూడా కనుగొన్నాడు.

ఆ కృషికి గుర్తింపుగా నెపోలియన్ చక్రవర్తి డేవీకికి ఒక పతకాన్ని ప్రదానం చేశాడు. రెండు కర్బన కడ్డీల మధ్య విద్యుత్తును పంపి ఉజ్వలమైన వెలుగుని సృష్టించిందీ హంఫ్రీ డేవీనే. ఒక ప్రత్యేక సేఫ్టీల్యాంప్‌ను సైతం రూపొందించాడు. ఆ విధంగా గనుల్లో పని చేసే వారు సురక్షితంగా ఉండే వీలు కల్పించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement