నాగ్ పూర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వ్యాపమ్ స్కామ్ మరణాలపై బీజేపీ మరోసారి స్పందించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న వరుస మరణాలు అన్నింటినీ వ్యాపమ్ స్కామ్ తో ముడిపెట్టొద్దని స్పష్టం చేసింది. వ్యాపమ్ స్కామ్ అంశంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను లక్ష్యంగా చేస్తూ రాజకీయ వేడి తీవ్రం కావడంతో బీజేపీ ఎంపీ రాకేశ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని అనుమానాస్పద మరణాలకు వ్యాపమ్ స్కామ్ తో జతచేయడం తగదని సూచించారు. వ్యాపమ్ స్కామ్ తో సంబంధమున్న వ్యక్తుల్లో 44 మంది మరణించినట్లు చెబుతున్నారని.. అయితే ఈ మరణాలు అన్నీ కూడా వ్యాపమ్ స్కామ్ కు సంబంధం లేదన్నారు.