
జవాన్ల కోసం చికెన్ బిస్కెట్, మటన్ బార్
న్యూఢిల్లీ: మంచు దుప్పట్లో, సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రాల్లో విధులు నిర్వర్తించే భద్రతా బలగాల కోసం డీఆర్‌డీవో కొత్త రకం ఆహారపదార్ధాలను అభివృద్ధిచేసింది. మాంసకృత్తులు అధికంగా ఉండే మటన్ బార్, చికెన్ బిస్కెట్, బడలికను పోగొట్టే తులసీ బార్‌లను తయారుచేసింది.
వీటితోపాటు పోషకాలు ఎక్కువగా ఉండే తృణధాన్యాల బార్‌లు, కోడిగుడ్డు ప్రోటీన్ బిస్కెట్లు, ఇనుము–ప్రోటీన్ల ఫుడ్ బార్‌లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే చాక్లెట్, చికెన్ కట్టీ రోల్స్‌లను అభివృద్ధిచేసింది. లోక్‌సభలో రక్షణశాఖ సహాయమంత్రి సుభాష్ ఈ వివరాలు చెప్పారు. పెద్దమొత్తంలో ఉత్పత్తి కోసం ఈ సాంకేతికపరిజ్ఞానాన్ని వివిధ రంగాలకు అందిస్తామన్నారు