శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అహ్మద్ హసన్ ఇమ్రాన్ ను సోమవారం ఈడీ అధికారులు ప్రశ్నించారు.
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన పది వేల కోట్ల శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అహ్మద్ హసన్ ఇమ్రాన్ ను సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. సాల్ట్ లేక్ కార్యాలయంలో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఎంపీ ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీశారు. ఆయనను అదుపులోకి తీసుకోవాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసులో శారదా గ్రూపు చైర్మన్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు అంతకుముందు టీఎంసీ ఎంపీ మిథున్ చక్రవర్తి, కునాల్ ఘోష్, నటి, దర్శకురాలు అపర్ణాసేన్, పశ్చిమ బెంగాల్ టెక్స్టైల్ మంత్రి శ్యామపాద ముఖర్జీని ప్రశ్నించారు.