అందరూ అవినీతిపరులు కారు..
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్
జగిత్యాల జోన్ : ‘రాజకీయ నాయకులందరూ అవినీతిపరులని, ఏసీల్లో ఉంటారని, వాళ్ల సుఖాలనే చూసుకుంటారని, తమను పట్టించుకోరనే భావన ప్రజల్లో ఉంది.. కానీ రాజకీయ నాయకుల్లో సైతం మానవత్వం ఉంటుంది’ అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో యశోద హాస్పిటల్ ఈఎన్‌టీ సర్జన్ దీనదయూళ్ ఆధ్వర్యంలో మూడు రోజు లుగా నిర్వహిస్తున్న ఈఎన్‌టీ సర్జికల్ క్యాంపు ఆదివారం ముగిసింది.
ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ చాలామంది రాజకీయ నాయకులు ప్రజాసేవ చేస్తూ తృప్తి పొందుతున్నారని చెప్పారు. ప్రతి మనిషికి డబ్బుంటే సరిపోదని, పది మందికి సేవలందించే గుణం కూడా ఉండాలన్నారు. ప్రజలందరికీ విద్య, వైద్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్య త ప్రభుత్వాలపైనే ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు.
జీవోలు, రూల్స్, సిస్టమ్ పేరిట వైద్య సౌకర్యాలను నీరుగార్చవద్దని వైద్య అధికారులకు సూచించానని తెలిపారు. జిల్లాలోని ఆసుపత్రులకు ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలకు మాత్రం మెరుగైన సేవలు అందించాలని కోరారు. పేదరికంతో చదువుకోలేని వారికి, వైద్యం చేయించుకోలేని వారికి ఎల్లప్పుడూ తన సహాయం ఉంటుందని, అలాంటి వారు తనను సంప్రదించవచ్చునని మంత్రి ఈటల అన్నారు.
కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆఫి నిర్వాహకులు డాక్టర్ సంజ య్‌కుమార్, ఈఎన్‌టీ శిబిరం ప్రాజెక్టు చైర్మన్ డాక్టర్ జి.వెంకటేశ్వర్లు, రోటరీ డిస్ట్రిక్ట్-3150 పల్స్‌పోలియో కన్వీనర్ మంచాల కృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు సిరిసిల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.