థానేలోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం | Fire breaks out on 12th floor of Sundarban Park building in Thane, two dead | Sakshi

థానేలోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం

Mar 16 2014 10:00 AM | Updated on Sep 5 2018 9:45 PM

థానేలోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం - Sakshi

థానేలోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం

మహారాష్ట్ర థానే నగరంలోని అపార్ట్మెంట్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది.

మహారాష్ట్ర థానే నగరంలోని అపార్ట్మెంట్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో ఇద్దరు మరణించగా,మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. థానేలోని సమతా నగర్లోని సుందర్బన్ అపార్ట్మెంట్12 వ అంతస్థులతో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో అపార్ట్మెంట్ వాసులు భయంలో బయటకు పరుగులు తీశారు.స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ సమాచారం అందించారు.

 

దాంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 12వ అంతస్థులో షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించిందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతులో ఇద్దరు భార్యాభర్తలను చెప్పారు. వారు నిద్రిస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement