'బాహుబలి' ప్రభాస్ ఫ్యాన్స్ కు తీపికబురు! | First look of Baahubali 2 will be out on Prabhas birthday | Sakshi
Sakshi News home page

'బాహుబలి' ప్రభాస్ ఫ్యాన్స్ కు తీపికబురు!

Published Sat, Aug 20 2016 1:33 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

'బాహుబలి' ప్రభాస్ ఫ్యాన్స్ కు తీపికబురు!

'బాహుబలి' ప్రభాస్ ఫ్యాన్స్ కు తీపికబురు!

'బాహుబలి' ప్రభాస్ అభిమానులకు తీపికబురు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న భారీ ప్రాజెక్ట్ 'బాహుబలి-2' ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికార ప్రతినిధి ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు తెలిపారు. 'ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా సీక్వెల్ లోని కీలక కంటెంట్ ను ప్రభాస్ పుట్టినరోజునాడు ఆవిష్కరించబోతున్నారు' అని వివరించారు.

దర్శకుడు రాజమౌలి మలిచిన 'బాహుబలి' భారీ విజయాన్నిసొంతం చేసుకోవడంతో  'బాహుబలి-2'పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ ఇప్పటికే స్పష్టం చేసింది.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'బాహుబలి' సినిమా విశేషాన్ని ఒకదానిని ఆవిష్కరించడం చిత్రయూనిట్ గతకొంతకాలంగా ఫాలో అవుతోంది. గతంలో కూడా ప్రభాస్ పుట్టినరోజు వేడుకను సెట్స్ లో నిర్వహించి ఆయనను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement