మరో కొత్తపార్టీ వచ్చింది.. | Former Congress leader Ajit Jogi names his political outfit as 'Chhattisgarh Janta Congress' | Sakshi
Sakshi News home page

మరో కొత్తపార్టీ వచ్చింది..

Published Tue, Jun 21 2016 7:17 PM | Last Updated on Tue, May 29 2018 11:17 AM

మరో కొత్తపార్టీ వచ్చింది.. - Sakshi

మరో కొత్తపార్టీ వచ్చింది..

రాయపూర్: చత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాం‍గ్రెస్ మాజీ నేత అజిత్ జోగి కొత్త పార్టీని ప్రకటించారు. దీనికి ‘చత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్’గా నామకరణం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన అజిత్ జోగి కొత్త పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

పార్టీకి పేరు పెట్టడానికి అజిత్ జోగి మద్దతుదారుల నుంచి పలు పేర్లు ప్రతిపాదనకు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం చత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ పేరును ఖరారు చేశారు. అజిత్ జోగి భార్య రేణు, ఆయన కొడుకు అమిత్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరితో పాటు మరో ఎమ్మెల్యే, మరికొందరు కాంగ్రెస్ నేతలు అజిత్ జోగికి మద్దతుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement